కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*
• నాలుగు రోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనున్న ముఖ్యమంత్రి.
• పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటన చేపడుతోన్న ముఖ్యమంత్రి బృందం.
• ఈ ఏడాది నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు రికార్డు స్థాయిలో ప్రతినిధులు హాజరవుతారని అంచనా.
• సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యే అవకాశం.
• WEF సదస్సుకు హాజరు కానున్న సుమారు 60 దేశాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు.
• ప్రపంచ ఆర్థిక సదస్సుకు భారతదేశం నుంచి హాజరుకానున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
• *ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకానుండడంతో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను పూర్తి స్థాయిలో వివరించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సిద్దం చేసిన ఏపీ ప్రభుత్వం.*
• *గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులు సాధించేలా ప్రణాళికలు*
• టూరిజం, హాస్పటాలిటీ, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులపైనా ఫోకస్ పెట్టనున్న కూటమి సర్కార్.
• *వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, తెచ్చిన పాలసీలను జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు వివరించనున్న సీఎం బృందం.*
• *అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామనే అంశాన్ని పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లనున్న ప్రభుత్వం.*
• *ఏఐ నిపుణులను సిద్దం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రధానంగా ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు బృందం.*
• *లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేసేలా అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సు నిర్వహిస్తున్నామని వెల్లడించనున్న ఏపీ ప్రభుత్వం.*
• *ఇప్పటికే 50 వేల మంది అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సులో శిక్షణకు నమోదు చేసుకున్నట్టు పారిశ్రామిక వేత్తలకు స్పష్టం చేయనున్న చంద్రబాబు.*
• *కాకినాడ గ్రీన్ అమోనియా-గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్న సీఎం.*
• *గతేడాది ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు… జరిపిన సంప్రదింపుల్లో సుమారు రూ. 2.36 లక్షల కోట్ల మేర పెట్టుబడులను రాబట్టగలిగిన ఏపీ ప్రభుత్వం.*
• *2025 WEF సదస్సులో చర్చలు జరిపిన 20 కంపెనీల నుంచి ఏపీకి పెట్టుబడులు.*
• ఈసారి పర్యటనలో అంతకు మించిన పెట్టుబడులు రాబట్టే దిశగా ప్రభుత్వం కసరత్తు.
• విశాఖ పెట్టుబడుల సదస్సు వివరాలను పారిశ్రామిక వేత్తలకు అందించనున్న టీమ్ ఏపీ.
• తొలి రోజు పర్యటనలో మొత్తంగా ఏడు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం.
• తొలి రోజు పర్యటనలోనే తెలుగు డయాస్పోరా వేదికగా తెలుగువారితో సమావేశం కానున్న ముఖ్యమంత్రి.
• *తెలుగు డయాస్పోరాకు 20 దేశాల నుంచి హాజరుకానున్న తెలుగు ప్రజలు.*
• *పారిశ్రామిక వేత్తలుగా మారాలని ఎన్నార్టీలను కోరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.*
• సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు.
