ఇంద్రకీలాద్రి అమ్మవారి హుండీ ఆదాయం వెల్లడి – 16 రోజులకు రూ. 2.60 కోట్లు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 16 రోజులకు గాను భక్తులు సమర్పించుకున్న కానుకలను అధికారులు లెక్కించారు.
ఆదాయ వివరాలు:
నగదు: రూ. 2,60,86,479/- (రెండు కోట్ల అరవై లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు).
బంగారం: 135 గ్రాములు.
వెండి: 2 కిలోల 858 గ్రాములు.
విదేశీ కరెన్సీ వివరాలు:
భక్తులు వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కూడా మొక్కుబడిగా సమర్పించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
యూఎస్‌ఏ (డాలర్లు): 804
యూరోప్ (యూరోలు): 235
యూఏఈ (దిర్హామ్స్): 185
నైజీరియా (నైరా): 1500
కెనడా (CAD): 100
కువైట్ (దినార్): 6
సింగపూర్ (డాలర్లు): 6
ఇంగ్లాండ్ (పౌండ్లు/డాలర్లు): 25
ఆస్ట్రేలియా (డాలర్లు): 15
న్యూజిలాండ్ (NZD): 15
సౌదీ అరేబియా (రియాల్స్): 30
మలేషియా (రింగిట్): 4
ఖతార్ (రియాల్): 4
