ఖేలో ఇండియా, అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ (సౌత్ జోన్) విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం.*
విజయవాడ* లోని మున్సిపల్ స్టేడియం, టెన్నిస్ కాంప్లెక్స్ నందు.. ఖేలో ఇండియా, అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ (సౌత్ జోన్) వారు సంయుక్తంగా నిర్వహించిన టోర్నీలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది..
ముఖ్య అతిథిగా ఏపీ SAP(స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ శ్రీ. రవినాయుడు గారు, బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ. పాతూరి నాగభూషణం గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ. అడ్డూరి శ్రీరామ్ గారు, కార్యక్రమానికి హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు..
ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి పాతూరి నాగభూషణం గారు ప్రసంగించారు.. కాగా ఈ కార్యక్రమంలో తమిళనాడు, ఒరిస్సా సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.
