కర్నూలు : పాణ్యం :
ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లె మరియు శకునాల గ్రామాల పరిధిలో ఉన్న రిలయన్స్ – బేవరేజెస్ (క్యాంప) కోకా – కోల కంపెనీను ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులు రైతులతో కలిసి సందర్శించిన వైయస్సార్సీపి నంద్యాల జిల్లా అధ్యక్షులు,
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాలలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం మరియు స్థానికులకు 70% ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు.
.కాల్వ రైతులకు ఇచ్చిన స్థలాలలో రోడ్డు వేస్తున్నారని వారికి ముందు నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా సంప్రదించకుండా పనులు చేయకూడదని, రైతులను సంప్రదించి వారి అంగీకారంతోనే పనులు మొదలుపెట్టాలని లేనిపక్షంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అధికారులని హెచ్చరించారు..
