కర్నూలు సిటీ : కర్నూలు :
ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లె, తిప్పాయపల్లె మరియు శకునాల గ్రామాల పరిధిలో ఉన్న ఓర్వకల్లు రిలయన్స్ – బేవరేజెస్ క్యాంప కోలా కంపెనీ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని.. పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాలలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని.
స్థానికులకు ఇండస్ట్రియల్ ప్రకారం ఉపాధి అవకాశాలు కల్పించాలని అలాగే కాల్వ మరియు హుసేనాపురం ప్రజలకు ఇచ్చిన ఇల్లస్థలములలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్లు వేస్తున్నారని, వారికి ముందు నష్టపరిహారం,
చెల్లించాలని, రైతులకు పొలాలకు వెళ్లే దారిని ఏర్పాటు చేయాలని ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులతో కలిసి వీటిపై తగు చర్యలు తీసుకోవాలని అర్జీని అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులు, రైతులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు….
