Home South Zone Andhra Pradesh Nara Lokesh: జ్యూరిచ్‌లో నారా లోకేశ్ సింపుల్ లుక్…

Nara Lokesh: జ్యూరిచ్‌లో నారా లోకేశ్ సింపుల్ లుక్…

0

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్ చేరిన చంద్రబాబు బృందం
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న ఏపీ టీమ్

ఫుల్ హ్యాండ్ టీషర్టు, ప్యాంట్ తో లోకేశ్ క్యాజువల్ లుక్
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని, ఏపీకి వీలైనన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ బృందం స్విట్జర్లాండ్ తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇవాళ జ్యూరిచ్ లో ఏపీ టీమ్ విస్తృత సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ రొటీన్ కు భిన్నంగా క్యాజువల్ డ్రెస్ లో సింపుల్ గా దర్శనమిచ్చారు. గోధుమ రంగు ఫుల్ హ్యాండ్ టీషర్టు, ప్యాంట్ ధరించి వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు.

కాగా, ఇవాళ దావోస్ పర్యటన ఆరంభంలోనే చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. స్విట్జర్లాండ్‌కు భారత రాయబారిగా ఉన్న మృదుల్ కుమార్‌తో చంద్రబాబు జ్యూరిచ్‌లో భేటీ అయ్యారు. ఫార్మా, మెడికల్ పరికరాలు, టెక్నాలజీ వంటి రంగాల్లో స్విస్ కంపెనీల నుంచి ఏపీకి పెట్టుబడులను తీసుకురావడంపై చర్చించారు. అనంతరం ఈరోస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత క్రియేటివ్ పరిశ్రమల ఏర్పాటు, ఏఐ ఫిల్మ్ సిటీ వంటి ప్రతిపాదనలపై చర్చలు జరిపారు.

జనవరి 23 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ‘బ్రాండ్ ఆంధ్ర’ను ప్రపంచానికి పరిచయం చేస్తూ గ్రీన్ ఎనర్జీ, ఏఐ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ఏపీ బృందం దృష్టి సారించనుంది. దావోస్ సదస్సులో భాగంగా ఐబీఎం, గూగుల్ క్లౌడ్ వంటి దిగ్గజ సంస్థల సీఈఓలతో సహా మొత్తం 36 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.

NO COMMENTS

Exit mobile version