బాపట్ల: విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు. బాపట్లలోని ప్రభుత్వ ఎస్సీ, సమీకృత ఎస్టీ బాలికల వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ వసతి గృహంలో వసతులు.
భోజన నాణ్యత, నీటి సరఫరా, క్రీడా కిట్లు తదితరాలను పరిశీలించారు. ఎస్టీ వసతి గృహంలో అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేసి, మెనూ అమలు, భోజన నాణ్యత, సిబ్బంది పర్యవేక్షణపై ఆరా తీశారు. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని, ట్యూటర్ నియామకం, దోమల మెష్, ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు జిల్లాలో ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు. బుధవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, కుర్చీలు, ప్రింటర్లు వంటి వివరాలను
ఈ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. ఆ వివరాల ఆధారంగా దాతలు సహకరించవచ్చని తెలిపారు.
ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ వైద్యశాలల్లో అవసరమైన వసతుల కల్పనకు ఈ వెబ్సైట్ కీలకంగా మారుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు నేరుగా లాభం చేకూరేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు.
#Narendra
