Home South Zone Andhra Pradesh పాఠశాల విద్యార్థులకు జిల్లా పోలీసులు శిక్షణ |

పాఠశాల విద్యార్థులకు జిల్లా పోలీసులు శిక్షణ |

0

చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, శక్తి బృందాలు సంయుక్తంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు మరియు వివిధ ప్రాంతాలలోని మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి,శక్తి యాప్ ఉపయోగాల గురించి, మహిళా సంబంధిత చట్టాల గురించి సైబర్ నేరాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించే వారి నుండి రక్షణ కల్పించాలంటే ఏది గుడ్‌ టచ్‌, ఏది బ్యాడ్‌ టచ్‌ అనే దాని గురించి బాలికలకు అవగాహన కలిగి ఉండాలన్నారు.

విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో డెమో ప్రదర్శించి సరైన మరియు అసహజ స్పర్శల మధ్య తేడాను వివరించారు.
ఎవరైనా అపరిచిత వ్యక్తులు బ్యాడ్ టచ్ చేయటానికి ప్రయత్నిస్తే వెంటనే ఉపాధ్యాయులకు గాని, తల్లిదండ్రులకు గాని, పోలీస్ వారికి గాని తెలియజేస్తే వారికి వెంటనే సాయం అందుతుందన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తక్షణ సహాయం పొందే సాధనంగా “శక్తి యాప్” ఉపయోగపడుతదిఅన్నారు.
శక్తి యాప్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చెయ్యాలి అనే విషయాలను వివరించడమే కాకుండా శక్తి యాప్ ను ఎలా పని చేస్తుందో అందరికీ అర్థమయ్యే విధంగా SOS విధానాన్ని పోలీస్ అధికారులు వివరించారు.
మాదకద్రవ్యాలకు విద్యార్థులు, యువత బానిసలై తమ జీవితాలను పాడుచేసుకోకూడదని హెచ్చరించారు.
సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, డిజిటల్ అరెస్ట్ పలు ఇతర రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.
గోల్డెన్ అవర్‌ లో సమాచారాన్ని అందిస్తే బాధితుల డబ్బు సురక్షితంగా తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
ప్రజల భద్రత, యువత భవిష్యత్తు రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version