కర్నూలు సిటీ :కర్నూలు జిల్లా….జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందిచే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ …జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో పోలీసు అధికారులు.
సిబ్బందితో కలిసి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ మోహన్ గారు మాట్లాడుతూ…ఓటరే ప్రజాస్వామ్య శక్తి అని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమేనన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఓటు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మంచి సమాజ స్థాపనకు ఓటే కీలకమన్నారు.ఈ క్రింది విధంగా ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. “భారతదేశ పౌరుడినైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయిత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం.
జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను” ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సైలు, సివిల్, ఎఆర్, జిల్లా పోలీసు కార్యాలయ మినిస్టిరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
