మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
క్షణాల్లో కళ్ళ ముందు నుండి కనబడకపోయినా తమ బాలుడు తిరిగి క్షేమంగా చేరడంతో తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఈఎస్ కాలనీలో నివాసముంటున్న రమేష్ కుమారుడు ఏడేళ్ల సంజయ్ అదృశ్యమయ్యాడు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల తక్షణ స్పందన : స్థానికుడి సహకారం.
ఫిర్యాదు అందిన వెంటనే అల్వాల్ పోలీసులు చురుగ్గా స్పందించారు. అదృశ్యమైన 30 నిమిషాల్లోనే బాలుని గుర్తించేందుకు తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో స్థానిక నివాసి మక్కల సర్వేష్ అందించిన కీలక సమాచారంతో సంజయ్ ను పోలీస్ లు విజయవంతంగా గుర్తించారు.
బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించినప్పుడు, ఇంతసేపు తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన వారు.. ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. తమ బిడ్డను ఇంత తొందరగా క్షేమంగా అప్పగించిన పోలీసులకు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు చూపిన చొరవను అల్వాల్ ఎస్ హెచ్ ఓ ప్రశాంత్ అభినందించారు.
#sidhumaroju
