Home South Zone Telangana స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

0

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు పాఠశాల సమయంలో రీల్స్ చేయడంతో పలుమార్లు ఉన్నతా ధికారులు హెచ్చరించారు. అయినా ఆ ఉపాధ్యాయురాలు తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించిన వివరాలివీ..

ఖమ్మం మామిళ్లగుడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బానోత్ గౌతమి కొన్ని నెలలుగా నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల అడ్మిషన్లకు సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ.. తన ప్రభుత్వ పాఠశాల విధులను నిర్లక్ష్యం చేస్తోంది. అలాగే పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయం వృథా చేస్తోందనే అంశాలపై గతంలో పలు మార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో గురువారం ఆమెను సస్పెండ్ చేశామని డీఈవో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాడు అందించాలని, విధినిర్వ హణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

. అలాగే డీఈవో కార్యాలయంలో మరో ఇద్దరు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఒకరు సమయం పాటించకుండా మధ్యాహ్నమే ఇంటికి వెళ్లడం, మరొకరు ఫైల్స్ ఆలస్యం చేస్తూ డీఈవో టేబుల్ పై ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతుండ టంతో మెమో జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. కార్యాలయ సిబ్బంది కార్యాలయ సమయపాలన పాటించాలని, అంకితభావంతో పని చేసి ఫైల్స్ అందించాలని డీఈవో సిబ్బందికి సూచించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు.*

NO COMMENTS

Exit mobile version