గురువారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న నిమ్మనపల్లి ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
