నిమ్మనపల్లి మండలంలో గురువారం సాయంత్రం ఆస్తి రాసివ్వలేదన్న కారణంతో తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేశాడు. తబలంలో నివాసం ఉంటున్న వెంకటరమణ.
లక్ష్మీదేవి దంపతులు తమ ఆస్తిలో వాటా కుమారుడు నారాయణకు ఇవ్వకపోవడంతో అతడు గొడవపడి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన దంపతులను స్థానికులు మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
