కర్నూలు
మహిళల భద్రత కు పటిష్ట చర్యలు చేపట్టిన కర్నూలు పోలీసులు.కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు , సచివాలయ మహిళా పోలీసులతో కలిసి సమావేశాలు నిర్వహించారు.
ఆయా పోలీసుస్టేషన్ ల పరిధులలోని గ్రామాలను , పాఠశాలలను, కళాశాలలను సందర్శించారు. మహిళల భద్రత , రక్షణ కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల విద్యార్ధినులకు సైబర్ నేరాలు, శక్తి యాప్, సోషల్ మీడియా పై అవగాహన కల్పించారు.ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వారి భద్రత కోసం డయల్ 100, 112, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లుకు గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని వివరించారు.
