కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా…కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన …. కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు.
కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు సిబ్బందికి మిఠాయిలు పంచారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఐజి మేనేజర్ రత్న ప్రకాష్, లైజనింగ్ ఆఫీసర్ తిక్కస్వామి, డిఐజి కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.
