మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ మాట్లాడుతూ, ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. శనివారం నెహ్రూ మున్సిపల్ హై స్కూల్‌లో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయసేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థినులకు బాలికల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.
