Home South Zone Andhra Pradesh ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు

ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు

0

గణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు
ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమశిక్షణతో పరేడ్ నిర్వహించాలని… ప్రముఖుల నుండీ ప్రజలు, విద్యార్థులు పాల్గొనే వేడుకలలో పటిష్ట భద్రత చేపట్టాలని ఆదేశాలు జారీ

అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల పురస్కరించుకుని సోమవారం నిర్వహించే సాయుధ బలగాల పరేడ్ ను మరియు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు సాయుధ దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్ల వారీగా పరేడ్‌ను సమగ్రంగా పరిశీలించారు. వి.వి.ఐ.పి తరహాలో జాతీయ

పతాకాన్ని ఆవిష్కరించారు. పరేడ్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్, ఎన్.సి.సి క్యాడెట్లు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాల కవాతును పరిశీలించి, క్రమశిక్షణతో సమన్వయంగా నిర్వహించాల్సిన విధానాలపై అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు విచ్చేసే వివిఐపీ, వీఐపీ అతిథులకు కూర్చునే సిట్టింగ్ ఏర్పాట్లు, భద్రత, సౌకర్యాలపై ఆరా తీసి లోటుపాట్లు లేకుండా పక్కాగా చేపట్టాలని సూచించారు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిపబ్లిక్ డే ఉత్సవాన్ని రాష్ట్రంలోనే గుర్తుండిపోయే విధంగా నిర్వహించాలని అధికారులకు తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు.సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం విద్యార్థినీ విద్యార్థులకు తగిన ఏర్పాట్లు ముందుగానే ఇతర అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

ఈ ఫుల్ డ్రస్ రిహార్సల్స్‌లో పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్, ఎన్.సి.సి క్యాడెట్లు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలబాలికలు తదితర బృందాలు కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసు జాగిలాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా ఎస్పీ గారితో పాటు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా మరియు పలువురు ఆర్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version