Home South Zone Andhra Pradesh పద్మశ్రీ పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్.

పద్మశ్రీ పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్.

0

కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం
ఇది తెలుగు హాస్యానికి, సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవమని వ్యాఖ్య

48 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనిదని ఉద్ఘాటన
ప్రముఖ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, తన జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ గౌరవం కేవలం తనకు మాత్రమే కాదని, తెలుగు హాస్యానికి, వినోదాన్ని ఆస్వాదించే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కళలను గౌరవించి, తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

గత 48 ఏళ్లుగా ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమే ఈ స్థాయి గుర్తింపునకు కారణమని ఆయన అన్నారు. “నాలాంటి నటుడిని మీ ఇంటి మనిషిలా ఆదరించి, ‘నటకిరీటి’ని చేసి, ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ చప్పట్లే. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను” అని రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తనను ఎప్పుడూ నవ్విస్తూ ఉండమని దీవించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

NO COMMENTS

Exit mobile version