బొబ్బిలి మండలంలోని ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. బొబ్బిలి మండలంలోని వేగవతినది నుంచి ఇసుక అక్రమంగా తరలిచడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొల్లి రాంకుమార్ దాడి చేసి 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు.
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వాకాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
#BOBBILI
