పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పుంగనూరు, చౌడేపల్లి, సోమల.
సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలోని కార్యాలయాలు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు, కళాశాలల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అధికారులు, నాయకులు జండా వందనం చేశారు.
అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకలు దేశభక్తిని చాటాయి# కొత్తూరు మురళి.
