మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : నేటి తరుణంలో సమాజ అభివృద్ధిని దేశ పురోగతిని అభివృద్ధి చేయడంలో విద్యావంతులైన యువతతే ప్రధాన భూమిక అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట (295) డివిజన్ లో గల లారస్ స్కూల్ వార్షిక వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ వేడుకలకు హరీష్ రావు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో చూపుతున్న కృషిని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
#sidhumaroju
