రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి నిర్వహణలో అందించిన ఉత్తమ సేవలకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు.
మదనపల్లిలోని బీటీ కళాశాల పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన సేవలను అభినందించారు.
