మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక సీటీఎం రోడ్డు, దేవతా నగర్‌కు చెందిన రామసుబ్బమ్మ (65)గా గుర్తించారు
. టిప్పర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
