మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బి.టీ కాలేజ్ గ్రౌండ్ నందు “మా” టపాసులు వ్యవస్థాపకుడు ఆర్యశంకర్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. త్రివర్ణ పతాకానికి జై నినాదాలతో దేశభక్తి వెల్లివిరిసింది. రంగురంగుల టపాసులతో ఆకాశం కాంతివంతంగా మారి, ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది.
