Home South Zone Andhra Pradesh లఘు ద్వారా చిత్రానికి అంతర్జాతీయ అవార్డు |

లఘు ద్వారా చిత్రానికి అంతర్జాతీయ అవార్డు |

0

జీవధార’ లఘుచిత్రానికి అంతర్జాతీయ అవార్డ్*
…ఉత్తమ నటుడిగా పులిగడ్డ …

బేబిచరణ్య సమర్పణలో త్రినేత్ర ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో గాదెనాగభూషణం రచన,దర్శకత్వంలో నిర్మితమైన “జీవధార” షార్ట్ ఫిల్మ్ కు ఇంటర్నేషనల్ అవార్డ్ దక్కింది. రోటరీక్లబ్ కళాచైతన్యం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీల లో నీటి ప్రాముఖ్యత ను తెలియజేస్తూ గాదె నాగభూషణం దర్శకత్వంలో రూపొందిన

“జీవధార” షార్ట్ ఫిల్మ్ లో ప్రధాన పాత్ర లో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఉత్తమ నటుడు అవార్డ్ దక్కింది. జనవరి 31 న హైదరాబాద్ లో జరిగే బహుమతి ప్రధానోత్సవ సభలో ఈ అవార్డ్ ను అందజేయనున్నారు. కాగా జీవధార షార్ట్ ఫిల్మ్ ను రూపొందించిన రచయిత, దర్శకుడు గాదె నాగభూషణం, ఈ ఫిల్మ్ లో నటించి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డ్ పొందిన పులిగడ్డ సత్యనారాయణ కు ఉండవల్లి గ్రామ ప్రజలు,కళారంగ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.

NO COMMENTS

Exit mobile version