Home South Zone Andhra Pradesh జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం

జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం

0

జనసేన నాయకుల మానవతా

ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల సందీప్ రూ. 50 వేలు, శ్రీ విశ్వక్ సేన్ రూ. 50 వేలు ఆర్థిక సహాయం

ఉపాధి కల్పించిన శాసనమండలి సభ్యులు, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu గారు
ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు శ్రీ పుక్కాల రాజశేఖర్ కుటుంబానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి డా.పంచకర్ల సందీప్ రూ.50 వేలు, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ శ్రీ విశ్వక్ సేన్ రూ.50 వేలు మొత్తం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా జనసేన నాయకుల మానవతా దృక్పథం

మరోసారి నిరూపితమైంది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంకు విచ్చేసిన శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు సమక్షంలో చెక్కులను అందజేశారు. శ్రీ పుక్కాల రాజశేఖర్ సతీమణి శ్రీమతి హరిప్రియ ఇటీవల ఎచ్చెర్ల పర్యటనలో శ్రీ నాగబాబు గారిని కలిసి.. సంబంధం లేని ఘర్షణలో తన భర్తను హత్యచేశారని, కుటుంబ పోషణ భారంగా

ఉన్నదని మొరపెట్టుకున్నారు. అప్పటికప్పుడు కొంత ఆర్థికసహాయం అందజేసిన శ్రీ నాగబాబు గారు ఉపాధి అవకాశం కల్పించారు. శ్రీమతి హరిప్రియ ఫిబ్రవరి నుంచి ఉద్యోగంలో చేరనున్నారు. మానవతా దృక్పథంతో జనసైనికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ పంచకర్ల సందీప్, శ్రీ విశ్వక్ సేన్ లను శ్రీ కె. నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు.

NO COMMENTS

Exit mobile version