Home South Zone Andhra Pradesh రాజకీయ పార్టీల తో ఆర్డీవో సమావేశం

రాజకీయ పార్టీల తో ఆర్డీవో సమావేశం

0

చీరాల: చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పలు రాజకీయ పార్టీల తో ఆర్డీవో  సమావేశం ఏర్పాటు చేశారు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ ఇప్పటివరకు నమోదైన,తొలగించిన, సవరించిన ఓటర్ల గురించి వివరించారు బూతుల వారీగా కొత్తగా ఓటర్లను చేర్చాలని బూత్ లెవెల్ ఆఫీసర్ల తోటి రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు సమన్వయంతో పారదర్శకంగా ఓటర్లు నమోదు ప్రక్రియ చేయాలని,రాజకీయ పార్టీలకు సూచించారు.

అలాగే త్వరలో జరగబోయే సంస్థ గత  ఎన్నికకు సమాయత్తం కావాలని దానికి సంబంధించి బూత్ ఆఫీసర్స్ తోటి, బూత్ లెవెల్ ఏజెంట్లు తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు  ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ, వేటపాలెం ఎమ్మార్వో గీతారాణి, చీరాల మున్సిపల్ కమిషనర్ డానియల్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు జనసేన పార్టీ నుండి

వేటపాలెం మండల అధ్యక్షులు డాక్టర్ మార్కండేయులు తెలుగుదేశం పార్టీ నుండి కీర్తి ప్రసాద్, వైయస్సార్ పి పార్టీ నుండి యాతం మేరి బాబు, బీఎస్పీ పార్టీ నుండి భగత్ సింగ్, బిజెపి పార్టీ నుండి పింజుల భరణి రావు,సిపిఎం పార్టీ నుండి నలతోటి బాబురావు  మున్సిపల్, ఎండిఓ, ఎంఆర్ఓ కార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version