Home South Zone Andhra Pradesh ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం పై DMHO కార్యాలయం దగ్గర ధర్నా |

ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం పై DMHO కార్యాలయం దగ్గర ధర్నా |

0

చీరాల: చీరాల శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ ఫెసిలిటీస్ హాస్పిటల్ లో డెలివరీ నిమిత్తం పండిలనేని సౌమ్య అనే మహిళ హాస్పటల్లో చేరారు మరుసటి రోజు ఉదయం 6 గంటలకు డాక్టర్ రామకృష్ణ హనుమాన్ సిజేరియన్ చేసి ఆడబిడ్డను తీసి పసిపాపను రూములో చేర్చి తల్లిని ఐసిలో రాత్రి 8:30 వరకు వైద్యం చేస్తూ ఉంచారు సుమారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తల్లికి సీరియస్ గా ఉంది అని గోరంట్ల సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గోరంట్ల రాజేష్ ను

టి రామకృష్ణ హనుమాన్ గారు పిలవగా అక్కడనుండి డాక్టర్ రాజేష్ గారి ఆస్పటల్ కు పేషెంట్ ను తీసుకొని వెళ్లి గోరంట్ల హాస్పిటల్ నందు మరో నాలుగు గంటల వైద్యం చేశారు ఈ క్రమంలో సౌమ్య తల్లిదండ్రులు డాక్టర్ల హడావిడి చూసి ఏం జరిగింది మా పాపకు అని అడగగా సీరియస్ గా ఉంది ఇక్కడి నుంచి గుంటూరు కి పంపిస్తాను తీసుకెళ్లండి అని చెప్పారు. ఈ క్రమంలో అంబులెన్స్ రావడానికి కూడా మరి కొంత సమయం వృధా

అవ్వడంతో పేషంట్ ఆరోగ్యం  మరికొంత క్షీణించి మార్గము మధ్యలో సౌమ్య చనిపోయింది అన్నారు. దీనికి ప్రధానమైన కారణం వైద్యుల నిర్లక్ష్య ఇలాంటి వైద్యులపై క్రమశిక్షణమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రజా సంఘాలు డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాలు ద్వేషించి బాపట్ల జిల్లా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు యం.వసంతరావు,సి.హెచ్. ముసుందర్,ఎన్.బాబురావు, మహిళా సంఘం కార్యదర్శి. సుభాషిని,హైకోర్టు అడ్వకేట్ రజిని  మాట్లాడుతూ… ఆరోగ్యంగా ఉన్నటువంటి సౌమ్య డెలివరీ అనంతరం డాక్టర్ రామకృష్ణ హనుమాన్ డాక్టర్

రాజేష్ వైద్య నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని చనిపోయిన సౌమ్యకు గతంలో ఎలాంటి అనారోగ్యాలు లేవని కేవలం డాక్టర్ల వైద్యంలో అలసత్వం నిర్లక్ష్యం వాళ్ళనే ఆమె చనిపోయిందని మెరుగైన వైద్యం సకాలంలో అన్ని ఉంటే సౌమ్య బతికి ఉండాలని అన్నారు. బాపట్ల డిఎంహెచ్ఓ

బాధ్యతలకు అండగా ఉండి సౌమ్య మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోకుండా వారించడం తగదని అందుకే ఈరోజు బాధ్యత కుటుంబ సభ్యులతో ఈ నిరసన  తెలియజేస్తున్నామని ఇప్పటికైనా డిఎంహెచ్ ఓ అధికారాన్ని ఉపయోగించి డాక్టర్. రామకృష్ణ హనుమాన్,డాక్టర్.జి. రాజేష్ లా డాక్టర్ లైసెన్సులను రద్దు చేయాలని,తక్షణమే ఎంక్వయిరీ రిపోర్ట్ ఇవ్వాలని,తల్లి లేని పసిపాపను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం డిఎంహెచ్ఓ  మాట్లాడుతూ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి బాధ్యత కుటుంబానికి తగు న్యాయం చేస్తామని అన్నారు కార్యక్రమాన్ని విరమించడం  జరిగింది.

#Narendra

NO COMMENTS

Exit mobile version