పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశాలకు అధికారులు గైర్హాజరు కావడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సమావేశాలకు హాజరుకాని అధికారులపై ఎమ్మార్వో తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల తమ కష్టాలు, సమస్యలు అధికారులకు చేరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.
