Home South Zone Andhra Pradesh అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.

అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.

0

గుంటూరు లీగల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు తరుపున దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్‌పై గురువారం స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో వాదనలు వినిపి ంచనున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు తీసుకున్న చర్యలపై న్యాయవాదులు, లీగల్‌ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. నిజానికి అంబటి రాంబాబు జైలుకు వెళ్లేంత తీవ్రమైన నేరంచేశారా? అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది. ఈకేసు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించాల్సిన నేర విభాగానికి చెందినదిగా న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇలాంటి కేసుల్లో చట్టపరంగా సెక్షన్‌ 41 నోటీసులు ఇవ్వడమే సాధారణ విధానమని లీగల్‌నిపుణులు గుర్తు చేస్తున్నారు.

అయితే నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం, కస్టడికి అప్పగించాలంటూ పిటీషన్‌వేయడం, చివరకు జైలుకు పంపడం, న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం బెయిల్‌ ఇవ్వకపోడమే కోర్టు స్థాయిలో జరిగిన తొలి తప్పుగా న్యాయవాదులు భావిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఇంతకన్న ఎక్కువ నేర తీవ్రత ఉన్న కేసుల్లో కూడా రిమాండ్‌ తిరస్కరించి నిందితులను విడుదల చేసిన ఉదారణలు ఉన్నాయని, లీగల్‌ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ఈక్రమంలో తక్కువ శిక్షకు లోబడి కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తున్న వ్యక్తిపై రాజకీయంగా, ప్రముఖ నాయకుడిపై ఇంత కఠిన చర్యలు తీసుకోవడం ఎంత వరకు సహజం. ఎంత వరకు న్యాయ సమ్మతం? అనే సందేహాలు న్యాయవాదుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, అంబటి రాంబాబు తరుపున న్యాయవాదులు ఇమినిటీషన్‌ పిటీషన్‌ కూడా కోర్టులో దాఖలు చేశారు.

ఈ పిటీషన్‌లో అంబటి రాంబాబు వయస్సు, ఆరోగ్య రిత్యా కనీస మానవీయ వసతులు కల్పించాలని కోర్టును కోరారు. దీనిలో ముఖ్యంగా ఏసీ సౌకర్యం, ఫ్రిజ్, వైద్య సదుపాయాలు, అవసరమైతే వైద్యుల సహాయం అందించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం కస్టడిలో ఉన్న వ్యక్తికి హక్కులు ఉంటానేని పేర్కొన్నారు. కనీస వసతులు కల్పించడం చట్టబద్ధమైన హక్కుని వారు చెబుతున్నారు. ఈపరిణామాలు చూస్తే చట్టం అమలవుతుందా, చట్టం పేరుతో అధికారం ప్రదర్శించబడుతుందా అనే ప్రశ్న న్యాయవాదులు, ప్రజల్లో వెలువడుతంది. గురువారం కోర్టుల్లో జరుగనున్న ఈకేసు దిశను మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి కేసుల్లో పోలీసు చర్యలకు మార్గదర్శంగా మారనున్నాయనేది లీగల్‌ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

NO COMMENTS

Exit mobile version