Home South Zone Andhra Pradesh చీరాల వన్‌టౌన్‌కు కొత్త ఎస్సై బాధ్యతలు |

చీరాల వన్‌టౌన్‌కు కొత్త ఎస్సై బాధ్యతలు |

0

చీరాల: చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై చీరాలకు వచ్చిన ఆయన అధికారికంగా విధుల్లో చేరారు.

ఈ సందర్భంగా ఎస్సై పి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, చీరాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని, నేర నియంత్రణకు పోలీస్ శాఖలోని అన్ని విభాగాలతో సమన్వయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

అలాగే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, బాధితులకు తగిన న్యాయం చేకూర్చడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చట్ట పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తానని, ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version