Home South Zone Andhra Pradesh చీరాల గోరంట్ల హాస్పిటల్‌కు ఏడాది: త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు

చీరాల గోరంట్ల హాస్పిటల్‌కు ఏడాది: త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు

0

చీరాల: చీరాల పట్టణంలో గత పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనంలో ఆధునిక పరికరాలతో అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి డాక్టర్ గోరంట్ల రాజేష్   ఆధ్వర్యంలో ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం కీలక ప్రకటనలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ రాజేష్, త్వరలోనే ఈ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

ఆరోగ్యశ్రీ అమలులోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు హాస్పిటల్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందికి అదనంగా, మరిన్ని అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకురావడం ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.ఈ హాస్పిటల్‌లో జనరల్ మెడిసిన్‌తో పాటు వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించి ఇక్కడి సేవలను తెలుసుకోవాలని కోరారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version