Home South Zone Telangana బాలానగర్ పీఈ ఇంజినీరింగ్ ఉద్యోగుల సమ్మె విజయవంతం |

బాలానగర్ పీఈ ఇంజినీరింగ్ ఉద్యోగుల సమ్మె విజయవంతం |

0

29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని AIFTU (అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య) వామపక్షాలు పిలుపునిచ్చాయి.

కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉమ్మడిగా ఈ సమ్మెను చేపట్టి, కార్మికుల హక్కుల పరిరక్షణకై ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి.

బాల నగర్ ఇండస్ట్రియల్ కార్మికుల ఆధ్వర్యంలో జనరల్ సెక్రెటరీ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రెటరీ వాసురెడ్డి , ఆర్గనైజర్ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి, క్యాషియర్ సోమయ్య, యూనియన్ మెంబర్ మల్లయ్య మరియు కమిట్ మెంబెర్స్ ఈ సమ్మెను విజయవంతం చేశారు..

NO COMMENTS

Exit mobile version