కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్స్ రాజ్యాంగ విరుద్ధమని, వాటిని వెంటనే రద్దు చేయాలని కాకినాడలో ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.
అంబేద్కర్ కృషితో లభించిన కార్మిక హక్కులను ఈ కోడ్స్ హరిస్తున్నాయని ఆప్ నేత వరదరాజ సాంచి విమర్శించారు. కార్మికులకు నష్టం కలిగించే ఈ అశాస్త్రీయ చట్టాలపై అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామని పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు
