మదనపల్లి ఎంఎల్ఎల్ హాస్పిటల్లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బెంగళూరు బాప్టిస్ట్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్యామ్ నేతృత్వంలో నిపుణులు పలువురు దివ్యాంగులకు పరీక్షలు చేసి జాగ్రత్తలు సూచించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్‌ను ‘వెలుగు’ కన్వీనర్ ఆర్. భాగ్యలక్ష్మి ఘనంగా సత్కరించారు. శిబిరంలో ప్రిన్సిపాల్ లీనాకుమారి, వార్డెన్ స్వీటీ మరియు వైద్య సిబ్బంది పాల్గొని రోగులకు అండగా నిలిచారు.
