గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం (ఫిబ్రవరి 16, 2026) ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి నారా లోకేశ్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు ఘనస్వాగతం పలికారు.
అనంతరం సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనను ఆహ్వానించారు. ఈ పర్యటనలో రాష్ట్రంలో ఆరోగ్యం, కృత్రిమ మేధ (AI), వ్యవసాయ రంగాల్లో సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయి.
బిల్ గేట్స్ RTGS కేంద్రాన్ని సందర్శించి సాంకేతిక పాలనను పరిశీలించనున్నారు.
