ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి గన్నవరం విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సమయంలో స్వల్ప ఆటంకం ఎదురైంది.
సోమవారం (ఫిబ్రవరి 16, 2026) ఉదయం విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రన్‌వే స్పష్టంగా కనిపించలేదు. విజిబిలిటీ (Visibility) కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో, ఏటీసీ (ATC) అధికారులు ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు.
దీంతో ఆయన విమానం సుమారు 15 నిమిషాల పాటు గగనతలంలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అనంతరం వాతావరణం కాస్త మెరుగుపడటంతో పైలట్లు విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేశారు. విమానాశ్రయంలో మంత్రి నారా లోకేశ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.
