Home South Zone Andhra Pradesh కురబలకోట వద్ద ప్రమాదం: ముగ్గురు భవన కార్మికులకు తీవ్ర గాయాలు

కురబలకోట వద్ద ప్రమాదం: ముగ్గురు భవన కార్మికులకు తీవ్ర గాయాలు

0

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చెన్నామరి మిట్ట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై మదనపల్లెకు పనుల నిమిత్తం వెళ్తున్న ముగ్గురు భవన కార్మికులను కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో కరీముల్లా, అక్బర్, సౌకత్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితులు పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version