చౌడేపల్లె మండలం బోయకొండ గంగమ్మ అమ్మవారిని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సోమవారం దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
