తంబళ్లపల్లె నియోజకవర్గంలోని వేంపల్లి మల్లయ్యకొండలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర తెలుగు యూత్ అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు.
లోకకళ్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన చినబాబు, శివనామ స్మరణతో భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని, ఆలయ ప్రాంగణంలో భక్తులకు సేవలందించారు.
