మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్‌ను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, మానవత్వం మరచిన ఆ కఠినాత్ముడికి మరణశిక్ష పడేలా కృషి చేస్తానని ఆయన మీడియా ముఖంగా స్పష్టం చేశారు.
