మదనపల్లెకు చెందిన పూల దివాకర్ (31) అదృశ్యంపై అతని తల్లి సోమవారం పీజీఆర్‌ఎస్ (PGRS)లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జనవరి 1న స్నేహితులతో బయటకు వెళ్లిన తన కుమారుడిని ఇద్దరు వ్యక్తులు చంపేశారనే అనుమానం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ, వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
