టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. నిందితుడు సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, నాలుగు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఆదేశించింది.
2002లో జరిగిన ఈ ఘటనలో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
