మహాశివరాత్రి పర్వదినాన నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ సేవలు అందిస్తున్న గంగులమ్మ (74) భక్తులు వెలిగించిన దీపాలను సర్దుతుండగా, ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుంది.
ఈ ఘటనలో ఆమెకు గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. పండుగ వేళ జరిగిన ఈ ప్రమాదంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది.
