Home South Zone Andhra Pradesh చిన్నగొట్టిగల్లు హైవేపై రోడ్డు ప్రమాదం: ఇద్దరికి గాయాలు

చిన్నగొట్టిగల్లు హైవేపై రోడ్డు ప్రమాదం: ఇద్దరికి గాయాలు

0

అనంతపురం-చెన్నై హైవేపై చిన్నగొట్టిగల్లు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కిరెడ్డిపల్లికి చెందిన కె. సుబ్బారెడ్డి, శ్రీనివాసులు కారులో తిరుపతికి వెళ్తుండగా, రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలవ్వగా, స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. హైవేపై నిబంధనల ఉల్లంఘనే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

# కొత్తూరు మురళి .

NO COMMENTS

Exit mobile version