మదనపల్లిలో చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గురువారం ఆయన డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచిన వారిపై కేసులు నమోదు చేయడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని, అండగా నిలబడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
