చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వేటపాలెంలో జెండర్ రిసోర్స్ సెంటర్ (GRC) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 12 మహిళా సంఘాలకు రూ. 2.40 కోట్ల చెక్కును అందజేశారు.
ఈ కేంద్రం ద్వారా మహిళలకు న్యాయ సలహాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.
#Narendra
