Home South Zone Andhra Pradesh కొంకుదురు త్రిముఖ లింగేశ్వర ఆలయంలో శివరాత్రి వైభవం!

కొంకుదురు త్రిముఖ లింగేశ్వర ఆలయంలో శివరాత్రి వైభవం!

0

కొంకుదురు త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ చైర్మన్ పడాల వెంకట రామారెడ్డి నేతృత్వంలో సుమారు 10 వేల మందికి అన్నసమారాధన, ప్రసాద వితరణ చేపట్టారు. శివనామ స్మరణతో కొంకుదురు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, వాలంటీర్లు మరియు పోలీసులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు.

NO COMMENTS

Exit mobile version