చీరాల కుప్పడం చీరకు జాతీయ అవార్డు దక్కడంతో అసెంబ్లీలో వేడుకగా అభినందనలు తెలిపారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్టాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే మాలకొండయ్య సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేశారు.
మన ప్రాచీన కళను కాపాడుకోవాలని, చేనేతను ధరించి నేతన్నలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మంత్రి సవితమ్మ చీరాల నేత కార్మికుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు.
#Narendra
