Home South Zone Andhra Pradesh పుంగనూరులో అగ్నిప్రమాదం: నీలగిరి తోట దగ్ధం.. ₹50 వేల నష్టం

పుంగనూరులో అగ్నిప్రమాదం: నీలగిరి తోట దగ్ధం.. ₹50 వేల నష్టం

0

పుంగనూరు మండలం భీమగానిపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో రేణుక రాధ్య అనే రైతుకు చెందిన నీలగిరి తోట దగ్ధమైంది. మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు ₹50 వేల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. వేసవి కాలం కావడంతో తోటల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version